బీర్కూర్, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రీతి నాయక్ మృతి విషయంలో దీక్షకు మద్దతుగా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు. ప్రీతి నాయక్ మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని, రోజుకో ప్రకటన చేస్తూ కేసు ప్రక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గిర్నితాండకి వాళ్ల కుటుంబాన్ని ఓదార్చడానికి వెళితే బిఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటని, అదేవిధంగా ప్రీతి నాయక్ మృతి విషయంలో వారికి ఆత్మ శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ కొరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం దారుణమని అన్నారు. ఈ విషయంలో గిరిజన ప్రజా ప్రతినిధులు స్పందించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. గిరిజన ప్రజాప్రతినిధులందరూ ప్రీతి నాయక్ మృతి విషయంలో ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
ప్రీతి నాయక్ మరణ విషయాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. ప్రియాంక రెడ్డి మరణం విషయంలో ఏ విధంగా ఎన్‌కౌంటర్ చేశారో నిందితుడు సైఫ్‌ను కూడా ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు, మండల ప్రధాన కార్యదర్శిలు శంకర్ నాయక్, దుర్గం సంజీవ్, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు దేవి సింగ్, ఓబీసీ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సతీష్, కూనింటి రామ్, మైనార్టీ మండల అధ్యక్షులు సమీర్, యువమోర్చా మండల అధ్యక్షులు సాయి కుమార్, దళిత మోర్చా మండల అధ్యక్షులు శేఖర్, కిషన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, దర్శనం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.