బాన్సువాడ, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కోనాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం కోసం వ్యాయామం పాటించాలని గ్రామ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్‌ముఖ్ అన్నారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది భాగ్య సైక్లింగ్ వల్ల కలిగే ఉపయోగాలు, లాభాల గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాయామం చేసినట్లయితే అనారోగ్యానికి గురికాకుండా ఉండవచ్చని ప్రస్తుత జీవన విధానంలో ఆరోగ్య వంతులే ధనవంతులని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహ చారి, విద్యా కమిటీ చైర్మన్ ఈశ్వర్ గౌడ్, ఉపాధ్యాయ బృందం అంజయ్య, నర్సింగ్ రావు, ప్రేమ్ రాజు, శైలజ, సౌజన్య ,పుష్పలత, ఏఎన్‌ఎం శోభ, ఆరోగ్య సిబ్బంది పల్లవి, అనురాధ, శంకర్ గౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.