బీర్కూర్, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉదయం వాకింగ్‌కు వెళ్లి మృత్యుఒడిలోకి చేరిన విషాద ఘటన సోమవారం ఉదయం బీర్కూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంభ సభ్యుల కథనం ప్రకారం బీర్కూర్ గ్రామానికి చెందిన రోషన్ (24) ప్రతిరోజు ఉదయం వాకింగ్ వెళ్లే అలవాటు ఉంది.
ఈ క్రమంలో సోమవారం కూడ ఉదయం బీర్కూర్ బాన్సువాడ ప్రధాన రహదారిపై వాకింగ్‌కు వెళ్లగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తము బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అందరితో కలివిడిగా మాట్లాడే రోషన్ చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.