నిజామాబాద్, మార్చ్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళ కేంద్రంగానే రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని వేల్పూర్ మండల కేంద్రంలోని సాయిబాబా టెంపుల్ ఫంక్షన్ హాల్‌లో బాల్కొండ నియోజకవర్గ అంగన్వాడి టీచర్లు,అంగన్ వాడి సూపర్ వైజర్లు, వివోఏ, సిసి, ఆర్‌పి, ఏఎన్‌ం, ఆశా వర్కర్లతో మంత్రి సతీమణి నీరజా రెడ్డితో కలిసి మహిళ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. వారి సేవలు, పని తీరును ప్రశంసించారు. ఈ సందర్బంగా మంత్రి సొంత తన ఖర్చులతో సుమారు వెయ్యి మందికి చీరలు పంపిణీ చేశారు. అనంతరం సతీసమేతంగా వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… మహిళా సాధికారత కోసం సీఎం కేసిఆర్ అంతలా ప్రపంచంలోనే మరెవరు ఆలోచన చేయలేరని మంత్రి వేముల స్పష్టం చేశారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కేసిఆర్ కిట్‌తో మొదలు వృద్యాప్యంలో ఆసరా పెన్షన్ వరకు ఎన్నో మానవీయ కోణ కార్యక్రమాలు నేడు కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు.
ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ప్రతినెలా 28వేల మంది బీడీ కార్మికులకు 5కోట్ల 65 లక్షలు,2016మంది ఒంటరి మహిళలకు 4లక్షల 65వేలు,12వేల765మంది వితంతువులకు 2కోట్ల 57లక్షలు,4242 వృద్ధాప్య పెన్షన్లకు 85 లక్షలు,10వేల మందికి షాదిముబారక్,కళ్యాణ లక్ష్మి కింద 100 కోట్లు,కేసిఆర్ కిట్ కింద 12 వేల చొప్పున ఇప్పటి వరకు నేరుగా బాల్కొండ నియోజకవర్గ మహిళకు 900 కోట్ల లబ్ది జరిగిందని మంత్రి వెల్లడిరచారు. ఇవే కాకుండా 19 నూతన అంగన్వాడి బిల్డింగ్స్,3కోట్లతో 52 మహిళ భవనాలు నిర్మించామన్నారు.
ముఖ్యమంత్రి కెసీఆర్ గతంలో అంగన్వాడి జీతాలు 4500 ఉంటే దాన్ని 10వేల 500 చేసుకొని మళ్ళీ 13,650 చేశారని గుర్తు చేశారు.%Aచీవీ%ల జీతాలు 4వేలు ఉంటే 27వేలు చేశారని, ఆశావర్కర్లకు 1500 ఉంటే 9,750 చేశారని, హోంగార్డులకు 12వేలు ఉంటే 30వేలు,%ప.ూ.A%లకు 2000 ఉంటే 5,900, అంగన్వాడి హెల్పర్స్ కు 4500 ఉంటే 7వేల 500 చేశారని తెలిపారు. 2014 నుండి మహిళ సంఘాల 6వేల గ్రూపులకు సుమారు వెయ్యి కోట్లు, ఈ ఒక్క సంవత్సరంలోనే 281 కోట్లు రుణాలు ఇచ్చామని తెలిపారు.
ఒక్క గ్రూప్ కి రుణపరిమితి 5లక్షల నుండి 20 లక్షలు చేశామని చెప్పారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడుతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని సీఎం కేసిఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తారు అన్నారు. ‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’’ ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో, గౌరవించ బడతారో అక్కడ దేవతలు నడియాడుతారు అని తెలిపారు. మహిళలు అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదని వారికి కావాల్సింది ప్రోత్సాహం అన్నారు. అందుకే అన్ని రంగాల్లో మహిళలకు కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని మంత్రి వేముల పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో మంత్రి సతీమణి వేముల నీరజా రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ మహిళా ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.