రెంజల్, మార్చ్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలంలోని పోతంగల్ గ్రామానికి చెందిన గోసంగి నవీన్, లత అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో వారి ముగ్గురు కూతుళ్లు సహస్ర, నాగలక్మీ, విష్ణు ప్రియలు ఆనాధలుగా మారారు. దీంతో చిన్నారుల పరిస్థితిని చూసి చలించిపోయిన రెంజల్ మండలం సాటాపూర్ గ్రామ సర్పంచ్ వికార్ పాషా పిల్లల పేర్లపై రూ.5000 రూపాయల చొప్పున ముగ్గురికి 15000 రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసి తన దాతృత్వం చాటుకున్నారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ హైమద్, ఉపసర్పంచ్ లత సాయిలు, గోసంగి సంఘం జిల్లా అధ్యక్షులు గంధం రాజేష్, బిఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు హాజీ ఖాన్, సురేష్, గంగయ్య గ్రామ యువకులు పాల్గొన్నారు.