నిజామాబాద్, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు సోమవారం నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశంలో మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ 10 వతేది శుక్రవారం దేశ రాజధాని ఢల్లీిలో జంతర్ మంతర్ వద్ద కల్వకుంట్ల కవిత నిర్వహించే ధర్నాలో పాల్గొనడానికి నిజామాబాద్ జాగృతి బాధ్యులు బయల్దేరి వెళ్లారు.
జిల్లా అధ్యక్షలు అవంతి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా బృందం బయల్దేరింది. బృందంలో జాగృతి రాష్ట్ర నాయకులు లక్ష్మీ నారాయణ భరద్వాజ్, నరాల సుధాకర్, సంగ్రాం సింగ్తో పాటు జిల్లా బాధ్యులు కల్లెం నవీన్ రెడ్డి, దేవేందర్, డేవిడ్ తదితరులు బయల్దేరారు.
కల్వకుంట్ల కవిత అనుకుంటే ప్రతీదీ సాధిస్తారని అన్నారు. అదే విధంగ ఈ రోజు కవిత మహిళా బిల్లును భుజాన ఎత్తుకోవడం గొప్ప విషయమన్నారు. కేంద్రాన్ని ఒప్పించి కవిత మహిళా బిల్లును సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.