కామారెడ్డి, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం నాటిన మొక్కలు భావితరాలకు ప్రాణవాయువును అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ లక్ష్మి, టీఎస్పీఎస్ సభ్యురాలు సుమిత్రానంద్, ఆర్టీవో వాణి, ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.