కామారెడ్డి, మార్చ్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కేంద్రంలోని మంజీరా కళాశాలలో పలువురు మహిళలను జాగృతి సభ్యులు సన్మానించారు. స్వయంకృషి తో కస్టపడి పనిచేసుకుంటూ కుటుంబ బారాన్ని మోస్తూ ఎదుగుతున్న మహిళా మనులను శాలువాతో సత్కరించి సన్మానించారు.
అనంతరం భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు అనంత రాములు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భారత దేశంలో మహిళలు గౌరవించబడతారని అన్నారు. సన్మానం పొందిన వారిలో అర్చన, వినోద, మంజుల, పుష్పలత, పోశవ్వ, హఫీజా, నాగలక్ష్మి లు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా భారత జాగృతి మహిళా అధ్యక్షురాలు బట్టు పద్మజ, సభ్యులు రమణా రావు, వంశీ, చక్రధర్, మంజీరా కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..