కామారెడ్డి, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరానికి వచ్చే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తారని చెప్పారు. కంటి వెలుగు కేంద్రంలో ఉన్న సౌకర్యాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సత్య బాయి, నేత్ర వైద్య నిపుణుడు లింబాద్రి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.