కామారెడ్డి, మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డిలోని సందీపని కళాశాలలో గురువారం పదో తరగతి పరీక్షలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలో 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11899 మంది విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తారని చెప్పారు. 595 ఇన్విజిలేటర్లను నియమించామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పరీక్షల విభాగం అధికారి నీలి లింగం, అధికారులు పాల్గొన్నారు.