సదాశివనగర్, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశినగర్ మండలం పద్మాజివాడి ఎక్స్ రోడ్ వద్ద కార్గో యూనిట్‌ను ఆర్టీసీ కార్గో సంస్థ మూడు జిల్లాల అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బి. శ్రీనివాస్ ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో సంస్థను ప్రజలకు చేరువ చేయడానికి ఉమ్మడి జిల్లాలో ఇది 32వ ఏజెన్సీ అని తెలిపారు. ఎక్కడైతే ప్రజలకు అవసరమో అక్కడ మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
కార్గో వల్ల ఆర్టిసి సంస్థకు నాలుగు రోజులకు కోటి రూపాయల ఆదాయం వస్తుందని ఆయన వివరించారు. ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు, పద్మాజివాడి టిఆర్ఎస్ నాయకుడు ఆనంద్, పద్మాజివాడి, అడ్లూరు ఎల్లారెడ్డి, సదాశివ నగర సింగిల్ విండో చైర్మన్లు టి గంగాధర్, మర్రి సదాశివరెడ్డి, వర్కల్ కమలాకర్ రావు, రామారావ్, రమేష్, అడ్లూరు ఎల్లారెడ్డి వీడిసి కార్యదర్శి చక్రధర్ గౌడ్, ఆర్టీసి సిబ్బంది రాజు, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.