రెంజల్, మార్చ్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం సరస్వతి విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్టించి యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషితో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని ప్రిన్సిపాల్ బలరాం అన్నారు.
తాము విధులు నిర్వహించిన పాఠశాలలో గుర్తింపుగా ఉండాలని విద్యార్థులకు విద్యాబుద్ధులు కలగాలని సరస్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగిందని విగ్రహ ప్రతిష్టాపనకు కృషి చేసిన ఉపాధ్యాయ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి విజయ సంతోష్, సర్పంచ్ రమేష్ కుమార్, ఎస్‌ఎంసి చైర్మన్ నాగరాజ్, ఎంఈఓ గణేష్ రావ్, పిఆర్టియు మండల అధ్యక్షుడు సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు చెన్నప్ప, శ్రీనివాస్, జ్యోతి, సుష్మ, సౌమ్య, మయూరి, లావణ్య, శ్యామల, గీత, సునీత, దంలా, సంతోష్, సురేష్, బాను, కృష్ణ, వీణా తదితరులు పాల్గొన్నారు.