కామారెడ్డి మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన సడుగు మల్లేశం గ్రామ పంచాయతీ కార్మికుడు తన కూతురు సుగుణ వివాహానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్‌కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్ వారి సహకారంతో పుస్తె మట్టెలు అందించారు.
ఈ సందర్భంగా మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు నాగరాజ్ మాట్లాడుతూ గతంలో ఆడబిడ్డ పెళ్లి అంటే తల్లిదండ్రులు భయపడే వారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి సంక్షేమ పథకం ప్రారంభించి ప్రతి ఆడబిడ్డ పెళ్లికి మేనమామ వలే ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు 1,00,116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
ఈ సందర్భంగా వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా సహాయం చేయమని అడగగానే పుస్తే మట్టెలు పంపించి తమ ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచిన బ్రహ్మంకు, అందించిన నాగరాజు గౌడ్‌కు వధువు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అల్వాల రేవతి శ్రీనివాస్, ఎంపిటిసి లక్ష్మారెడ్డి, కాశీరాం, లక్ష్మయ్య, లక్ష్మణ్, రాజు, సిద్దయ్య, నర్సయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.