గాంధారి, మార్చ్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ లాంటి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చుస్తే ఎవరైనా సరే ఖబర్దార్ అని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. శనివారం గాంధారి మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్ మోహన్ రావు కార్యకర్తల చేరిక కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి అని అబద్దపు ప్రచారంతో పాల్గొనడం పట్ల అభ్యతరం వ్యక్తం చేశారు.
జహీరాబాద్ కు ఇప్పుడు ఇంచార్జి గా అంజనీ కుమార్ యాదవ్ ఉన్నారని, అదికూడా తెలియకుండా కేవలం నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టడానికే వచ్చారని ఆరోపించారు. అదికూడా నియోజకవర్గం లోని కొంత మంది కాంగ్రెస్ నాయకులకు చెప్పి పర్యటించడం ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా అజహారుద్దీన్ పర్యటన లో స్థానిక కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని వారు ఖండిరచారు.
అజహారుద్దీన్ నువ్వు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో మ్యాచ్ టికెట్ లను బ్లాక్ లో అమ్ముకున్న దొంగవి అని విమర్శించారు. అలాంటి నువ్వు జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద అయిన షబ్బీర్ అలీ మీదనే అనుచిత వాక్యలు, అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డి నుండి ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని అనడం కార్యకర్తలను అయోమయానికి గురిచేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లో చిచ్చు పెట్టాలని చుస్తే తగిన పాఠం చెబుతామణి హెచ్చరించారు.
అదేవిదంగా నీతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వల్ల కాంగ్రెస్ పార్టీ కి లాభం లేదని అన్నారు. ఇంకో సారి ఇలాంటివి పునరావృతమైతే కాంగ్రెస్ కార్యకర్తలుగా ఊరేకునేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ కామెల్లి బాలరాజ్, లైన్ రమేష్, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఆఫీజ్, మోహన్ నాయక్, గణేష్ నాయక్, రాజు తదితరులు పాల్గొన్నారు.