కామారెడ్డి, మార్చ్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపు మేరకు బూత్ సశక్తికరణ్ అభియాన్‌లో భాగంగా ఆదివారం వన్ డే వన్ బూత్ కార్యక్రమాన్ని భిక్నుర్ మండలం కంచర్ల గ్రామంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే పార్టీ గెలుస్తుందని, ప్రతి బూత్‌లో 31 మందితో నూతనంగా కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. వన్ డే వన్ బూత్ కార్యక్రమంలో భాగంగా శక్తి కేంద్రం ఇంఛార్జి, అల్ప కాలిక విస్తారక్ తమ బూత్‌లో నూతన కమిటీ ఏర్పాటు చేసి గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను కలిసి బీజేపీ పార్టీ సిద్ధాంతాలను తెలియజేయాలని అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇంటింటికి బీజేపీ పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలిసేలా చేయాల్సిన బాధ్యత బూత్ కార్యకర్తలదే అన్నారు.