మోర్తాడ్ మార్చ్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కామర్స్ సబ్జెక్టులో బోధించుటకు గెస్ట్ లెక్చరర్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెద్దన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండి నెట్, సెట్, పిహెచ్డి కలిగి బోధన అనుభవం కలవారికి ప్రాధాన్యత కలదని దరఖాస్తులను అన్ని జిరాక్సులతో ఈనెల 13వ తేదీ సోమవారం వరకు మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అందజేయాలని తెలిపారు. అలాగే 14వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు మోర్తాడ్ డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూ ఉంటాయని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీ పెద్దన్న తెలిపారు.