కామారెడ్డి, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ కె తిరుమల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, అంగన్వాడీ టీచర్స్, ప్రాంగణ ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చట్టం అమలుతీరును పరిశీలించేందుకు దోమకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టును ఎంపిక చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా సర్వే చేస్తున్నామన్నారు. ఆయా నివేదికలను అందచేసి చట్టంలో సంస్కరణలు తీసుకొస్తామని విదార్థులను, అధికారులకు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ దోమకొండ మండలంలోని అన్ని అంగన్వాడి సెంటర్స్‌లో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు పోషకాహారం ఏ విధంగా అందుతుంది, అంగన్వాడి సెంటర్ లోని సమస్యలను మండలంలోని అన్ని అంగన్వాడీ టీచర్స్ అడిగి తెలుసుకున్నారు. దీని ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఆహార భద్రత చట్టంను 2013 లో ప్రవేశ పెట్టడం జరిగిందని, దీనిపై అవగాహన కల్పించారు. ప్రజలందరూ తమ చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రాథమిక ఆహారాన్ని అన్ని సమయాల్లో పొందేలా మరియు ఆహార లభ్యత వినియోగం మరియు స్థిరత్వం నేషనల్ హెల్త్ సర్వేలు కూడా చేయడం జరుగుతుందన్నారు.
ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ వారితో కలిసి దోమకొండ మండలములోని యొక్క సర్వేను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో మరియు అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్‌తో మాట్లాడారు. కార్యక్రమానికి దక్షిణ ప్రాంగణం ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్కరాజు హరిత అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రమ్య, సూపరింటెండెంట్ భరత్, డిపిఎం సుధాకర్ దక్షిణ ప్రాంగణం అధ్యాపకులు లలిత, అంజయ్య, యాలాద్రి, నరసయ్య, నారాయణ, దిలీప్, రమాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.