ఆర్మూర్, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని ఆర్మూర్ ఏ.సి.పి కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా సోమవారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ ఏ.సి.పి కార్యాలయంలో ముందుగా గౌరవ వందనం స్వీకరించి, కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు, వారి సాదకబాదకాలు అడిగి తెలుసుకున్నారు. సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఏ. సి. పి కార్యాలయం రికార్డులు, స్పెషల్ గ్రేవ్ కేసులు, 5 యస్ విధానము, ఎస్సి, ఎస్టి కేసులు, హెచ్.ఆర్.ఎమ్.ఎస్ విధానము, ఎఫ్ఎస్ఎల్ రికార్డులు అమలులో చక్కగా విధులు నిర్వహించిన సిబ్బందిని అభినందించారు.
కార్యకమ్రంలో ఆర్మూర్ డివిజన్ ఎ.సి.పి ఆర్. ప్రభాకర్ రావు, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, సీ.సీ.అర్.బి ఎస్ఐ చందాయా సిబ్బంది ఉన్నారు.