కామారెడ్డి, మార్చ్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు.
కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ రవీందర్, జిల్లా అధికారులు రాజారాం, శ్రీనివాసరావు, దయానంద్, సాయి భుజంగరావు, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.