Daily Archives: March 14, 2023

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ చౌరస్తాలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాగేపూర్‌ గ్రామానికి చెందిన సాయిలు తన ద్విచక్ర వాహనంపై రాంబాయి, ఆశమ్మతో కలిసి బెల్లూరుకు వెళ్తుండగా సాటాపూర్‌ గ్రామ చౌరస్తాలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బండి అదుపుతప్పి పడిపోవడంతో వెనకాల …

Read More »

తైబజార్‌ వేలం పాట వాయిదా

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ వారంతపు సంత తైబజార్‌ వేలంపాట వాయిదా వేసినట్లు సర్పంచి వికార్‌ పాషా తెలిపారు. నలుగురు వ్యాపారస్తులు వేలం పాటలో పాల్గొనగా రూ.8.35 లక్షలు పలికిందని ప్రభుత్వం నిర్దేశించిన లెక్కల ప్రకారం వేలంపాట సాగకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ఈనెల 20వ తేదీన వేలం పాట నిర్వహిస్తున్నట్లు సర్పంచ్‌ వికార పాషా తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

కల్లడిలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం

నిజామాబాద్‌ రూరల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్లడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతికి చెందిన విద్యార్థులు 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ కార్యకమ్రం నిర్వహించారు. కల్లడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గంగోల్ల ప్రళయ్‌ తేజ్‌ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నందున విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, జామెట్రి …

Read More »

గ్రూప్‌ 4 అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేత

కామారెడ్డి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామంలో సేవ్‌ ది గర్ల్‌ చైల్డ్‌ సంస్థ ఫౌండర్‌ చంచల్‌ గూడ ఎస్పీ నవాబ్‌ శివకుమార్‌ గౌడ్‌ సహకారంతో గ్రూప్‌ 4 ఎగ్జామ్‌ కు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ సర్పంచ్‌ రేవతి శ్రీనివాస్‌తో కలిసి పంపిణి చేశారు. ఈ …

Read More »

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్‌

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను ద్వారా మంజూరైన రూ.20 లక్షల తో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం సర్పంచ్‌ వెల్మల సునీత నర్సయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ దృష్టికి ఇందిరమ్మ కాలానికి సీసీ రోడ్డు …

Read More »

సాటాపూర్‌లో కంటివెలుగు ప్రారంభం

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ వికార్‌ పాషా అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యాధికారి వినయ్‌ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్‌ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్‌ గ్లాసులో మందులు మోతి …

Read More »

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ …

Read More »

కంటివెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సందర్శించారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రజల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేయాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో …

Read More »

నిస్వార్థ సేవకులే రక్తదాతలు..

కామారెడ్డి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన నవనీతకు (19) అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్‌ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్‌ షాదాబ్‌ సహకారంతో సకాలంలో వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్టు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »