రెంజల్, మార్చ్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ వికార్ పాషా అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యాధికారి వినయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులో మందులు మోతి బిందువు ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వియోగపరుచుకోవాలని అన్నారు.
ప్రతి ఒకరికి అవసరం మేరకు ఉచిత మందులతో పాటు గ్లాసులను అందించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ హైమద్, ఉపసర్పంచ్ లత, పంచాయతీ కార్యదర్శి మహబూబ్ ఆలీ, ఆరోగ్య విస్తీర్ణ అధికారులు శ్రావణ్ కుమార్, కరిపే రవీందర్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు.