రెంజల్, మార్చ్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులను ద్వారా మంజూరైన రూ.20 లక్షల తో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణ పనులను మంగళవారం సర్పంచ్ వెల్మల సునీత నర్సయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ దృష్టికి ఇందిరమ్మ కాలానికి సీసీ రోడ్డు కావాలని కోరగా అడిగిన వెంటనే రూ.20 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు.
కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతలోపం లేకుండా చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా డైరెక్టర్ మౌలానా, ఉపసర్పంచ్ మస్కుర్ లక్ష్మీ, ఎంపీటీసీ లక్ష్మీ లింగారెడ్డి, కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్, రామాలయం చైర్మన్ లింగాల అబ్బన్న, వార్డు సభ్యులు క్రాంతి కుమార్, నారాయణ రెడ్డి, ఫాకూర్ బేగ్, నాయకులు మల్ల సాయిలు, అన్వర్, అనంత్ రావ్, సాయిలు, ఉమర్, తదితరులు ఉన్నారు.