16,17, 18 వ తేదీలలో వేలంపాట

కామారెడ్డి, మార్చ్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌ వేలం పాటలో ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని ప్లాట్లను సొంతం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం ధరణి టౌన్షిప్‌ పాట్ల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు.

ఈనెల 16,17, 18 వ తేదీలలో ప్లాట్లు కావలసిన వ్యక్తులు వేలంపాటకు హాజరై తమకు నచ్చిన ప్లాట్లను పొందే వెసులుబాటు కలుగుతోందని తెలిపారు. ఈనెల 20, 21న వివిధ దశలో ఉన్న గృహాలు వేలంపాట ద్వారా పొందే వీలుందని చెప్పారు. వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయలు ఈఎండి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్‌డిఎం చిందం రమేశ్‌, టీఎస్‌ఐఐసి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రాందాస్‌, రాజీవ్‌ స్వగృహ ఏజీఎం సత్యనారాయణ, తాసిల్దార్‌ వెంకట్‌ రావు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »