నిజామాబాద్, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో ప్రతి మనిషి వినియోగదారుడైనని, వినియోదారులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మాయావార్ రాజేశ్వర్ సూచించారు. గురువారం ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల అవగాహన చైతన్య సదస్సు సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ వినియోగదారులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అప్పుడే వినియోగదారుడికి మేలు జరుగుతుందని అన్నారు.
ముఖ్యంగా వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు సదరు వస్తువు నాణ్యత పరిశీలించి మన్నికగా ఉందా లేదని నాణ్యత పరిమాణం చూసి కొనుగోలు చేయాలన్నారు. ముఖ్యంగా ఐఎస్‌ఐ అగ్మార్క్ హల్ మార్క్ ఉన్నటువంటి వస్తువులను మాత్రమే వినియోగదారులు కొనుగోలు చేయాలని రాజేశ్వర్ సూచించారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ కుక్కర్స్, గ్రైండర్స్, సెల్ ఫోన్స్ ఇతరత్రా ఎలక్ట్రాన్స్ గూడ్స్ ఖరీదు చేసేటప్పుడు వ్యాపారి వద్ద నుండి వారంటీ గ్యారంటీ కార్డుతో పాటు బిల్లులు పొందాలని వినియోగదారులకు సూచించారు.
నూతన వినియోగదారుల చట్టం 2019లో పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత జూలై 2020 నుంచి అమల్లోకి రావడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలకు విజ్ఞప్తి చేయడం వినియోగదారులకు తెలియపరచడం మార్కెట్లో ప్రజలు తాగేటటువంటి పాలు పెద్ద ఎత్తున కల్తీలు జరుగుతున్నాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని పాలు ఖరీదు చేయాలన్నారు. ఎక్కడైనా కల్తీ జరిగినట్టు అనుమానం వస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
సేవా రంగాల్లో అనగా డాక్టర్స్ లేబరేటరీస్ స్కానింగ్ సెంటర్స్ బ్లడ్ యూరిన్ టెస్టులలో ప్రజలకు అన్యాయం జరిగితే జిల్లా వినియోగదారుల కమిషన్ లో కేసులు వేయాలన్నారు. కల్తీలో మోసాలు జరిగినప్పుడు తూనికల్లో కొలతల్లో మోసాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేయాలని, ఎమ్మార్పీ కంటే అధిక డబ్బులు వసూలు చేసే యజమానులపై కూడా లీగల్ మెట్రోలజీ అధికారులకు తెలియజేయాలని అన్నారు.
వినియోగదారులు జిల్లా వినియోగదారుల కమిషన్లో 50 లక్షల వరకు నష్టపరిహారం పొందవచ్చని, అలాగే రాష్ట్ర వినియోగదారుల కమిషన్ లో 10 కోట్ల వరకు జాతీయ కమిషన్ లో 10 కోట్లపై ఎంతవరకైనా నష్టపరిహారం పొందడానికి నూతన వినియోగదారుల చట్టంలో పొందుపరచడం జరిగిందన్నారు.