కామారెడ్డి, మార్చ్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం బ్రాహ్మణపల్లి లో కంటి వెలుగు శిబిరాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. 18 ఏళ్ల నిండిన వ్యక్తులు కంటి వెలుగు శిబిరానికి హాజరయ్యే విధంగా ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.
కంటి వెలుగు శిబిరం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేయాలని వైద్యులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.