రెంజల్, మార్చ్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి దశనే భావితరాలకు బాటలు వేసేందుకు ఉపయోగపడుతుందని జన వికాస్ సేవా సంస్థ అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి అన్నారు. శుక్రవారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు జనావికాస్ సేవ సంస్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షా అట్టలు,పెన్నులు, వాటర్ బాటిళ్లు, పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో స్థిరపడి తల్లిదండ్రులతోపాటు, గురువులకు గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చినప్పుడే సరైన గుర్తింపు లభిస్తుందని వారన్నారు. ఉన్నత విద్య ద్వారానే విద్యార్థికి సరైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. అనంతరం మొదటిసారి గ్రామానికి విచ్చేసిన జన వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తెడ్డు పోశెట్టి దంపతులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో సర్పంచ్ వెలుమల సునీత నరసయ్య, ఎంపిటిసి లక్ష్మి లింగారెడ్డి, రైతుబంధు జిల్లా డైరెక్టర్ మౌలానా, రామాలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు లింగాల అబ్బన్న, మల్ల సాయిలు, రాంపూర్ సర్పంచ్ రుతు కల్పన, నవీపేట్ సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, సాయిలు, ఉపాద్యాయులు శ్రీనివాస్ రెడ్డి, రాజు, నాయకులు పార్వతి రాజేశ్వర్, మధు, అన్వర్, ఉమర్ తదితరులు ఉన్నారు.