కామారెడ్డి, మార్చ్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో ఉన్న వివిధ దశల్లో నిర్మాణం పూర్తయిన గృహాల వేలంకు రేపు చివరి రోజు అని కలెక్టరేట్ ఏవో రవీందర్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ధరణి టౌన్షిప్‌లోని గృహాలకు వేలంపాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏవో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
వేలం పాటలో 11 ఫ్లాట్లు, ఏడు గృహాలు విక్రయించగా రూ.2.35 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.వేలం పాటలో పాల్గొని గృహం కేటాయింపు జరిగిందని నిర్ధారణ లేఖ ఇచ్చిన నాటి నుంచి ఏడు రోజుల్లోపు కొనుగోలు చేసిన గృహం మొత్తం విలువలో 33 శాతం చెల్లించవలసి ఉంటుందన్నారు. కొనుగోలు చేసిన రోజు నుంచి 45 రోజుల లోపు మొత్తం విలువలో రెండో విడతగా 33 శాతం చెల్లించాలని చెప్పారు.
గృహం మొత్తం విలువలో మిగతా మొత్తాన్ని ఈ ఎండి కలుపుకొని నిర్ధారణ లేక అందిన నాటి నుంచి 90 రోజులలోపు చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో రాజీవ్ స్వగృహ ఏజీఎం సత్యనారాయణ, అధికారులు రాందాస్, సాయి భుజంగరావు పాల్గొన్నారు.