కామారెడ్డి, మార్చ్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 20న సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యకమ్రాన్ని రద్దుచేసినట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యకమ్రాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు కార్యాలయానికి రావద్దని సూచించారు. అత్యవసర వినతులుంటే కార్యాలయ ఆవరణలో బాక్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినతులను బాక్సులో వేయాలని సూచించారు.