కామారెడ్డి, మార్చ్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదేళ్లకు ఒకసారి ఆధార్‌కు డాక్యుమెంట్లు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం డిఎల్‌ఏఎంసి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆధార్ అప్డేట్ చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవడం వల్ల ఓటీపీ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు పొందే వీలుందని చెప్పారు.
ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి రేషన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.0-5 పిల్లలను అంగన్వాడి సెంటర్లు ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకోనే వీలుందని తెలిపారు. 6-15 పాఠశాలలో చదివే విద్యార్థులు ఎం ఆర్ సి భవనంలో అప్డేట్ చేసుకోవాలని చెప్పారు.
16 నుంచి 70 ఏళ్ల వరకు సిఎస్సి కేంద్రంలో ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, యుఐడిఏఐ అసిస్టెంట్ మేనేజర్ డి. వినయ్, ఈ డిస్టిక్ మేనేజర్ ఏ. ప్రవీణ్ కుమార్, లీడ్ బ్యాంకు మేనేజర్ చిందం రమేష్, అధికారులు పాల్గొన్నారు.