ఆర్మూర్, మార్చ్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ సబ్ పోస్ట్ ఆఫీస్‌లో సోమవారం సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఆధ్వర్యంలో ఎస్పీఎం ఆంజనేయులు 18 గ్రామాల బీపీఎంలు ఏపీపీఎంలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఏఎస్పీ సురేఖ మాట్లాడుతూ గ్రామాలలో బీపీఎంలు, ఏపీపీఎంలు పాఠశాలలు, కళాశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లి పీఎల్‌ఐ, ఆర్‌పిఎల్‌ఐ పాలసీలపై అవగాహన కల్గించి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ కల్పిస్తున్న విధానాన్ని, పథకాలను అర్థం చేయించి, సద్వినియోగం చేసుకోవాలని కోరాలని పాలసీలకు తుది గడువు ఈనెల 31వ తేదీ వరకని, డివిజన్ స్థాయిలో ప్రతీ గ్రామంలో పట్టణాల్లో ఎక్కడైనా తపాలా కార్యాలయంలో పాలసీలు చేయవచ్చని, టీచర్స్‌కు వివరించాలన్నారు.
అలాగే భద్రాచలంలో రాములోరి కళ్యాణోత్సవాలలో అంత్రాలయ అర్చన కళ్యాణ తలంబ్రాలు స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటి వద్దకే తెప్పించుకునే సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని,అంత్రాలయ అర్చన, కళ్యాణ తలంబ్రాలకు 450 రూపాయలు, ముత్యాల తలంబ్రాలకు 150 రూపాయలు చెల్లించి మీ ఇంటి వద్దకే తలంబ్రాలు తెచ్చుకుని సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించి, జిల్లా స్థాయి టార్గెట్‌ను పూర్తి చేసి, జిల్లా పేరు నిలబెట్టాలని సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ కోరారు.
కార్యక్రమంలో బీపీఎంలు శ్రీనివాస్ రెడ్డి, లింబాగౌడ్, వెంకట్రాం, జగదీశ్వర్, ఎర్రటి శ్రీనివాస్, రవీంధర్, మహిళా బీపీఎంలు, ఏబీపీఎంలు రాజేష్, సుదర్శన్, రాము, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.