ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మార్చ్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని, ఇప్పటికే సంక్షేమాభివృద్ది కార్యక్రమాల అమలులో యావత్‌ దేశానికి తెలంగాణ మార్గదర్శంగా నిలుస్తోందని అన్నారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »