కామారెడ్డి, మార్చ్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు అంచనాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్షిప్లో మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్, విద్యుత్తు, ఆర్‌అండ్‌బి, రెడ్ కో అధికారులతో సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యుత్తు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం వంటి పనుల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, రాజీవ్ స్వగృహ ఏజీఎం సత్యనారాయణ, మున్సిపల్, విద్యుత్తు, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.