కామారెడ్డి, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో బాలమని మహిళకు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో టేక్రియాల్ గ్రామానికి చెందిన కళాకారుడు డప్పు స్వామి మానవతాదృతంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేసి ఆపరేషన్ విజయవంతం అయ్యేలాగా సహకరించారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తన డప్పుతో, పాటలతో యువకులను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎంతగానో కృషిచేసిన డప్పు స్వామి నేడు ఆపరేషన్ నిమిత్తమై కావలసిన రక్తాన్ని మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి అందజేసినందుకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.