నిజామాబాద్, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అధునాతన సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను శుక్రవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిపి నాగరాజుతో కలిసి ప్రారంభించారు. సి సి కెమెరా విభాగం, ట్రాఫికింగ్ సిగ్నల్ కెమెరాలు, సైబర్ క్రైమ్, సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా విభాగం, ఐటి విభాగంలను పరిశీలించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో పోలీసింగ్ అధ్భుతంగా ఉన్నదని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్‌లో ఉన్నది కాబట్టే రాష్ట్రానికి పెట్టు బడులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర పోలీస్‌ల పనితీరు పట్ల జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డులు వస్తున్నాయని తెలిపారు. గ్రామ స్థాయి నుండి జిల్లా కేంద్ర కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అన్ని సిసి కెమెరాలు అనుసంధానం కావాలని చెప్పారు. నేరాల నియంత్రణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
నిజామాబాద్ జిల్లాలో గంజాయిని ఉక్కు పాదంతో అనిచివేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గాల్సిన అక్కర్లేదని, ఎవరిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. గంజాయి సేవించే వారిపై కేసులు పెడితే సప్లై చేసే వాళ్లు బయట పడతారని, సప్లై దారులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. తల్లి తండ్రులు కూడా పిల్లల వ్యవహార శైలిని తరుచూ గమనిస్తూ ఉండాలని సూచించారు.
తల్లి తండ్రులు మొదటనే ఆ పరిస్థితులు గుర్తిస్తే వారిని కట్టడి చేయొచ్చని అన్నారు. గంజాయి నిర్మూలనపై నెల రోజుల తర్వాత మళ్లీ సమీక్షిస్తా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎంత మందిని కట్టుకున్నారో చెప్పాలని పోలీస్‌లకు మంత్రి టాస్క్ ఇచ్చారు.