బీమ్‌గల్, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం పోస్టల్ శాఖ తపాలా బీమా లాగిన్ డే సందర్భంగా ఆర్మూర్ సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఆధ్వర్యంలో 16 గ్రామాల బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, సహాయ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆర్మూర్ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ మాట్లాడుతూ గ్రామాలలో బీపీఎంలు, ఏబీపీఎంలు పాఠశాలలు, కళాశాలలకు ఉదయాన్నే వెళ్లి పిఎల్‌ఐ, ఆర్పీఎల్‌ఐ పాలసీలపై అవగాహన కలిగించి, తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ కల్పిస్తున్న విధానాన్ని పథకాలను వివరించి,సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అలాగే భద్రాచలం రాములోరి కల్యాణోత్సవంలో ఆంత్రాలయ అర్చన, కళ్యాణ తలంబ్రాలు 450 రూపాయలు, ముత్యాల తలంబ్రాలకు 150 రూపాయలు చెల్లించి ఇంటి వద్దకే స్పీడ్ పోస్ట్ ద్వారా తెచ్చుకునే సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.