రెంజల్, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుల ఎంపిక విషయంలో పలు గ్రామాల సర్పంచులు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శంకర్‌ను నిలదీశారు. ఉత్తమ గ్రామపంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు, ఇతర ప్రజాప్రతినిధులను సన్మానించేందుకు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల ఎంపికలో పారదర్శకతను పాటించకపోవడంపై రెంజల్ వీరన్నగుట్ట గ్రామాల సర్పంచులు రమేష్ కుమార్, రాజులు ఎంపీడీవో శంకర్ పై అసహనం వ్యక్తం చేశారు.
రాజకీయ అండ దండలు ఉండి, ప్రగల్బాలు పలికినవారికి ఉత్తమ అవార్డులకు ఎంపిక చేశారని ఆరోపించారు. అభివృద్ధి పనుల విషయంలో సర్పంచుల సహకారం కోరరా అన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోనున్నట్లు స్పష్టం చేశారు. వారి వెంట నాయకులు రోడ్ల లింగం, కాశం సాయిలు, కృష్ణారావు, నర్సయ్య తదితరులు ఉన్నారు.