ఆర్మూర్, మార్చ్ 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలం వాగ్గడ్డ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ స్వాములు పాదయాత్రగా గురువారం బయలుదేరారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామం నందు వెలసిన శ్రీ మహాపుణ్యక్షేత్రం కొండగట్టు వరకు పాదయాత్రగా బయలుదేరి స్వామి అంజన్నకు మొక్కులు తీర్చుకుంటారు.
ఇలా ప్రతి ఏటా అంజన్న హనుమాన్ స్వాములు పాదయాత్రకు బయలుదేరుతారు. భక్తులు మాట్లాడుతూ ప్రతి ఊరు ఊరు నుండి హనుమాన్ భక్తులు స్వాములు పాదయాత్ర చేస్తారు కాబట్టి వాహనదారులు చీకటి పూట వాహనాలు చూసుకొని నడపగలరని విజ్ఞప్తి చేశారు. యాత్రలో భాగంగా ముత్యం మచ్చర్ల మల్లయ్య, మిద్దెల తేజ, సూరి గౌడ్, అన్వేష్, భోజన్న, వంజరి సంజీవ్, కృతిక్, చెర్రీ, రాజేష్, మచ్చర్ల విజయ్, నరేందర్, జెసిబి శేఖర్, ప్రభాకర్ తదితరులు బయలుదేరారు.