పారిశుద్య కార్మికుల వేతనాలు అందజేయాలి

మాక్లూర్‌, మార్చ్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడు నెలలుగా పారిశుద్ధ కార్మికులకు (గ్రామ పంచాయితీ సిబ్బందికి) వేతనాలు ఇవ్వడం లేదని, తక్షణమే వారికి వేతనాలు మంజూరు చేయాలని మాక్లూర్‌ మండల బిజెపి నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు మాక్లూర్‌ మండల బిజెపీ శాఖ అధ్వర్యంలో శుక్రవారం ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఎస్సీ మోర్చ జిల్లా అధ్యక్షులు శివప్రసాద్‌ మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని పారిశుద్ధ కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు కలగడ్డ వినోద్‌ కుమార్‌, జిల్లా నాయకులు గంగొని సంతోష్‌, గంగోని వినోద్‌, ప్రధాన కార్యదర్శి మదరి రాజేశ్వర్‌, రమేష్‌ నాయక్‌, సురేష్‌ నాయక్‌, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్‌.కె. అరిఫ్‌, బామన్‌ మోహన్‌, అనిల్‌, రవి గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »