ఆర్మూర్, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌లోని సంతోష్ నగర్ గల్లీలో అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ ఆర్మూర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రతిరోజు తృణ ధాన్యాలు తీసుకోవాలని అవి రాగులు, సజ్జలు, కొర్రలు బెల్లం నువ్వులు ఆహారంలో భాగంగా తీసుకోవాలని పిల్లలకు ఎత్తుకు తగిన బరువు ఉండేలాగా చూసుకోవాలని ఆరోగ్యం పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని అయిల్ పుడ్‌లు తగ్గించాలని సలహాలు సూచనలు చేసారు.
పోషణ పక్షంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ భార్గవి, ఏసిడిపిఓ జ్యోతి, సూపర్వైజర్ నలిని, అంగన్వాడి టీచర్ సవిత, గర్భవతులు పిల్లలు తల్లులు, ఆయా తదితరులు పాల్గొన్నారు.