నిజామాబాద్, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదక్ పల్లి పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాయబోతున్న 48 మంది విద్యార్థులకు కాల్పోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాము, ఉపాధ్యాయురాలు స్వప్న పరీక్షా సామాగ్రిని అందించారు. కార్యక్రమానికి అతిథిగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ పాల్గొన్నారు.
ముదక్ పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోశన్న మాట్లాడుతూ పరీక్షా సమయంలో విద్యార్థులకు కావలసిన సామాగ్రిని కాల్పోల్ పాఠశాల అధ్యాపక బృందం రాము, స్వప్న అందించడం సంతోషకరమన్నారు. నాణ్యమైన పరీక్షా సామాగ్రి ప్యాడ్, నాలుగు పెన్నులు, పెన్సిల్, షార్పనర్, ఎరేజర్, పౌచ్ ఇతరత్రా ఇవ్వడం చాలా సంతోషమని జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ అన్నారు.
కాల్పోల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాము మాట్లాడుతూ నేటి విద్యార్థులకు సహాయం చేస్తే రేపటి నాడు ఇదే విద్యార్థులు సమాజానికి సేవ చేస్తారనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న, వివేకానంద తదితరులు పాల్గొన్నారు.