కామారెడ్డి, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న శ్యాంసుందర్ (48) కి అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కాగా పాల్వంచ గ్రామానికి చెందిన అంకాలపు నవీన్ సహకారంతో బి నెగిటివ్ రక్తాన్ని అందజేసినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ బి, ఏ, ఓ, ఏబి నెగిటివ్ ల రక్తానికి సంబంధించిన గ్రూపులు సమాజంలో చాలా తక్కువగా ఉండడం జరుగుతుందని, 17వ సారి రక్త దానం చేసిన రక్తదాత అంకాలపు నవీన్‌కు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు,కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు.
గతంలో చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నదని తెలియజేయగానే వెంటనే స్పందించి రక్తదానం చేయడం జరిగిందని, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానానికి ముందుకు వస్తున్న రక్తదాత నేటి యువతకు ఆదర్శంగా నిలచారని వీరిని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి యువకులు రక్తదానానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్, వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంక్స్ సిబ్బంది ఏసు గౌడ్, చందన్ పాల్గొన్నారు.