కామారెడ్డి, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శనివారం ఫోక్స్, జెజె యాక్ట్ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పోక్స్ కోర్ట్ ప్రత్యేక స్థలంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. గ్రామస్థాయిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బాలికల సంరక్షణ పై కళాజాత ప్రదర్శనలు నిర్వహించాలని తెలిపారు. బాలికలను వేధిస్తే చట్టం ప్రకారం పడే శిక్షణ గురించి వివరించాలని చెప్పారు. రాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ అపర్ణ, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ జడ్జి శ్రీనివాస్ నాయక్, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, సి డబ్ల్యూ సి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, కన్సల్టెంట్ డేవిడ్ రాజు, జిల్లా బాలల పరిరక్షణ అధికారిని స్రవంతి, అధికారులు పాల్గొన్నారు.