గ్రామాల అభివృద్ధికి అధికారుల చొరవ ప్రశంసనీయం

కామారెడ్డి, మార్చ్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు చూపిన చొరవ ప్రశంసనీయమని జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం జాతీయ స్థాయి పంచాయతీ అవార్డ్‌ 2023 కు ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు, సన్మానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు పోటీతత్వంతో పని చేయాలని తెలిపారు. అన్ని రంగాల్లో జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్న కలెక్టర్‌ బృందానికి ధన్యవాదాలు చెప్పారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏపుగా పెరగడంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. జాతీయ పంచాయతీ అవార్డుల కోసం జిల్లా నుంచి 525 గ్రామపంచాయతీలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వాటిలో 27 పంచాయతీలు ఉత్తమ పంచాయతీ అవార్డులను సాధించినట్లు చెప్పారు.

రాష్ట్రంలో అతి తక్కువ పోషకారాలోపంతో ఉన్న పిల్లలు జిల్లాలోని అంగన్వాడి కేంద్రాల్లో ఉన్నారని పేర్కొన్నారు. సర్పంచులు పోటీపడి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీలు సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలని చెప్పారు. 27 గ్రామపంచాయతీలు జాతీయస్థాయి అవార్డులకు ఎంపికైనందున వారికి అవార్డులను, ప్రశంస పత్రాలను జడ్పీ చైర్పర్సన్‌ శోభ, కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారికి సన్మానం చేశారు.

సమావేశంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రేమ్‌ కుమార్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, జెడ్పి సీఈవో సాయ గౌడ్‌, డిపిఓ శ్రీనివాసరావు, అధికారులు, ఎంపీపీలు, జెడ్పిటిసి సభ్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »