నిజామాబాద్, మార్చ్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద సుమారు రూ.120 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న రిజర్వాయర్, కాలువల నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న పనులు కావడంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ప్రత్యేక టాప్లెస్ వాహనంలో కలెక్టర్ తో కలిసి రిజర్వాయర్ పనులను క్షేత్ర స్థాయి సందర్శన జరిపారు.
దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టల మధ్యన నిర్మాణం అవుతున్న సిద్ధాపూర్ రిజర్వాయర్ వల్ల చేకూరే ప్రయోజనాల గురించి, దీని ఆవశ్యకతను స్పీకర్ పోచారం కలెక్టర్ కు తెలియజేశారు. ఎలాంటి సాగునీటి వసతి లేని తండాలు, అంతకుముందు సంబంధిత అధికారులతో రిజర్వాయర్ పనుల ప్రగతిపై స్పీకర్, కలెక్టర్ రిజర్వాయర్ నిర్మాణ ప్రదేశంలోనే సమీక్ష జరిపారు.
పనులను వేగవంతంగా చేపడుతూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు స్పీకర్ దిశానిర్దేశం చేశారు. వీరి వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీఎఫ్ఓ వికాస్ మీనా, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, ఆర్అండ్బీ ఎస్.ఈ రాజేశ్వర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.