రెంజల్, మార్చ్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి, ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడుó ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన సగ్గు శేఖర్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 26 వేల చెక్కును అందజేశారు.
అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిది ద్వారా ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత చెక్కును మంజూరు చేయడం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత సహాయ సహకారాలు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ధనుంజయ్, నారాయణ, వేణు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.