ఆర్మూర్, మార్చ్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆర్మూర్, పెర్కిట్, కొటార్మూర్, పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా వీరి ఇంటి ముందరే ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు. ఈ సందర్భంగా లక్ష్మీ ప్రియా, గంగా మోహన్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని మార్చి 31 చివరితేదీ కాబట్టి దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వార్డులో వార్డ్ ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా ఇంటివద్దే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించి, ఈ కార్డుతో 5లక్షల వరకు ఆరోగ్య చికిత్స ఉచితం, దీనికింద 20 వేలకు పైగా ఆసుపత్రుల్లో 1000 కి పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చని సూచించారు. ప్రతి పేదవాడి కుటుంబాన్ని అనారోగ్యం నుండి రక్షించాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమన్నారు. కార్యక్రమంలో కోటార్మూర్ ఇంచార్జ్ లక్ష్మీ ప్రియా, గంగా మోహన్ ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డుని ప్రతిఒక్క వ్యక్తి తీసుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు : 7989555048, 7386627879.