ఎడపల్లి, మార్చ్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగ నిర్దారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్‌ఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ కార్యాలయంలో పీసీపీఎన్‌డీటీ (ఫ్రీ-కాన్షక్షన్ -ఫ్రీ -నాటల్ డయోగ్నస్టిక్ టెస్ట్స్)పై అంగన్వాడీ, ఆశా, మహిళా సంఘాల ప్రతినిధులు, ఏఎన్‌ఎం లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీపీఎన్‌డీటీ యాక్ట్ గురించి క్షేత్ర స్థాయిలో, మండల స్థాయి అధికారులు ఎంపీడీఓలు, తహసీల్దార్‌లు, ప్రాజెక్టు అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, పోలీసులు అవగాహన కల్పించాలన్నారు.
ఈ చట్టం పకడ్బందీగా అమలు చేయుటకు పోలీసుశాఖ సహాయ సహకారాలు తప్పని సరి అన్నారు. గర్భందాల్చిన తర్వాత నాలుగు నెలల నుండి ఆరు నెలల వరకు వారిని పరిరక్షిం చాలని, తరచుగా అభార్షన్‌లు చేయించుకుంటున్న గర్భిణులపై ఆరోగ్య సిబ్బంది, నిఘా ఉంచాలన్నారు. ఆసుపత్రులలో ఎవరైనా లింగనిర్ధారణ స్కానింగ్ చేస్తే కటకటాలపాలవుతారని ఆయన హెచ్చరించారు.
గర్బస్థ పిండ పరీక్ష ప్రక్రియ నియంత్రణ దుర్వినియోగ నివారణ చట్టంపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని చాలామంది స్కానింగ్ సెంటర్లల్లో లింగనిర్ధారణ చేయించుకుని ఆడబిడ్డ అయితే అబార్షన్లు చేయిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం 1994, 2003 చట్టం ప్రకారం ఎవరైనా లింగనిర్ధారణ పరీక్షలు చేసే డాక్టర్లు, ప్రోత్సాహించే వారిని మొదటిసారి తప్పు చేస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా, రెండోసారి చట్టాన్ని అతిక్రమిస్తే ఐదు సంవత్సరాలు జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారని తెలిపారు.

సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, మండల వైద్యాధికారి వినీత్ రెడ్డి, హెచ్ ఈఓ రాములు, ఐకేపీ ఏపీఎం సాయిలు,ఎంపీఓ సుభాష్ చంద్రబోస్, పోలీస్ సిబ్బంది, పిహెచ్‌సి సిబ్బంది తదితరులు ఉన్నారు.