కామారెడ్డి, మార్చ్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వసతులు, సమస్యల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ కు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తారని చెప్పారు. మొక్కల పెంపకం కోసం నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తేనెటీగల పెంపకం చేపట్టాలని కోరారు. విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించాలన్నారు. ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కళాశాల స్థలం అక్రమణకు గురి కాకుండా చూడాలని కోరారు. సమావేశంలో మైనారిటీ, బిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ ప్రిన్సిపాల్ డాక్టర్ కిష్టయ్య, ప్రవీణ్ కుమార్, గంగాధర్, శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.