డిచ్‌పల్లి, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కిక్ బాక్సింగ్ వుమెన్స్ టోర్నమెంట్ -2023 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించిన పవర్ ఉమ బి.ఏ. ద్వితీయ సంవత్సరం విద్యార్థినికి మంగళవారం వైస్ చాన్సలర్ ఆచార్య డి. రవిందర్ గుప్తా, రిజిస్ట్రార్ ఆచార్య విద్యావర్ధిని ఘనంగా సన్మానించారు.
గిరిరాజ్ కళాశాలలో బి.ఏ. ద్వితీయ సంవత్సరం చదువుతున్న పవర్ ఉమ, ఆమె 50 కెజిల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించి తెలంగాణ యూనివర్సిటీ కీర్తి పెంపోందిచడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని వైస్ చాన్సలర్ ప్రొడి. రవిందర్ గుప్తా, రిజిస్ట్రార్ ప్రొ. బి. విద్యా వర్ధిని ప్రశంసిస్తూ అభినందించారు.
యూనివర్సిటీ చరిత్రలోనే మొట్ట మొదటి పతకం సాధించినందుకు చాలా గర్వంగా ఉందని, అనేక మంది క్రీడా కారులు ప్రతిరోజు తమ నైపుణ్యతలను పెంపొందించుకొని ఇంకా అనేక పతకాలు సాధించాలని వర్సిటీ క్రీడా విభాగం డైరెక్టర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ టి. సంపత్ ఉమను అభినందించారు.
కార్యక్రమంలో కోచ్ పి. శ్రీనివాస్ గిరాజ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్, బి. బాలమని వర్సిటి క్రీడా విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ (సి), డాక్టర్. బి. ఆర్ నేత, కిక్ బాక్సింగ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. టోర్న మెంట్ – మార్చి 20 – 22 వరకు ఉత్తరప్రదేశ్‌లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వంచల్ యూనివర్సిటీలో జరిగింది.