మోర్తాడ్, మార్చ్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వేల్పూర్ ప్రయాణంలో అమీనాపూర్ వద్ద గుత్ప,నవాబ్ లిఫ్ట్ ల ద్వారా చెరువులు నింపడానికి కెనాల్ ద్వారా నీరు విడుదల కొనసాగుతుండటంతో… ఆగి కాలువలో పారుతున్న నీటిని చూసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబురపడ్డారు.
ఈ సందర్భంగా మంత్రి వీడియో ద్వారా ప్రజలతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు నవాబ్, గుత్ప లిఫ్ట్ ద్వారా వేల్పూర్, అమీనాపూర్, కుకునూర్, లక్కోర కోమనపల్లి, వెంకటాపుర్, అంక్సాపూర్, డొంకల్ గ్రామాలలో సుమారు 12 చెరువులు మార్చి నెల ఎండాకాలంలో కూడా నింపుకున్నామని, మండుటెండల్లో అలుగులు పారుతున్నయని ఆనందం వ్యక్తం చేశారు.